రావి వారి పాలెం గ్రామ అభివృద్ధి ముఖ్య అంశం గా రావి వారి పాలెం గ్రామస్థుల సమావేశము 19/02/2013 అనగా మంగళ వారం రావి వారి పాలెం రామాలయం దగ్గర జరిగింది. దీనిలో ముఖ్యం గా చర్చించిన అంశాలు.
1. రావి వారి పాలెం పాత సొసైటి భవనం నిర్వహణ మరియు అభివృద్ధి
2. ఊరికి ఒక కళ్యాణ మండపం కావాలనె ప్రతిపాదన
3. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి తమవంతు
విరాళం గా మొదట శ్రీ రావి గోపాల రావు మరియు ఫ్రసూనాంబ గార్లు ఒక లక్ష
రూపాయలు విరాళం గా అందచేసారు.
4. శ్రీ మెడబలిమి మల్లిఖార్జున రావు గారు తమవంతు విరాళం గా రెండు లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు.
5. ఊరికి కీ.శే రావి సాగర్ జ్ఞాపకార్ధం
సాగర్ మిత్రులు ఇచ్చిన ఫ్రీజర్ బాక్స్ (ఎవరైనా చనిపోయినపుడు పార్ధివ
దేహాన్ని వుంచేది ) ను బద్రపరచడానికి పాత సొసైటి ఆవరణ లో ఒక గది కట్టించి
ఇవ్వడం.
6. ఇటువంటి కార్యక్రమాలు సమన్వయ పర్చడానికి ఒక కమిటీ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన
ఈ సమావేశం లో పాల్గొన్న వాళ్ళు :
మెడబలిమి మల్లిఖార్జున రావు, కంఠం నేని కుటుంబరావు, కావురి రామ క్రిష్ణ, రావి నాని, రావి ప్రసాద రావు, రావి ప్రమోద్ దాస్, దేవినేని చిన సుబ్రమణ్యం, దేవినేని పెద సుబ్రమణ్యం, కావురి నరేంద్ర, రావి హేమంత్, రావి సాంబశివరావు, రావి రాంబాబు, పరుచూరి బుడ్డియ్య, టైరు, భుట్టోజి, రావి లక్ష్మణ రావు, రావి మల్లిఖార్జున రావు, బజ్జిలు, రావి తాతయ్య, జొన్నలగడ్డ బాబురావు, కంఠం నేని మాధవ రావు